1 సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయునక్కరలేదు.
2 రాత్రివేళ దొంగ ఏలాగువచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగ తెలియును.
3 లోకులు - నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించునుగనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు.
4 సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు.
5 మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు;2మనము రాత్రివారము కాము, చీకటివారముకాము.
6 కావున ఇతరులవలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులముకాక యుందుము.
7 నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
8 మనము పగటివారమైయున్నాము గనుక మత్తులమైయుండక, విశ్వాసప్రేమలను మైమరుపును, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
10 మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.
11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనికొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
12 మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై యుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి
13 వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.
14 సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా - అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత ఇయ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి.
15 ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
16-18. యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవునిచిత్తము.
19 ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
20 సమస్తమును పరీక్షించి మేలైనదాని చేపట్టుడి.
21-22. ప్రతి విధమైన కీడుకుదూరముగా ఉండుడి.
23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
24 మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
25 సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
26 పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
27 సహోదరులందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను.
28 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

No comments:
Post a Comment