Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

1వథెస్సలొనీకయులకు1వఅధ్యాయము

1  తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న థెస్సలొనీకైయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమొథెయును (శుభమని చెప్పి) వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 
2  విశ్వాసపూర్వకమైన మీ పనిని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ పూర్వకమైన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవునియెదుట మానక జ్ఞాపకముచేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 
3  విశ్వాసపూర్వకమైన మీ పనిని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ పూర్వకమైన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవునియెదుట మానక జ్ఞాపకముచేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 
4  ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. 
5  ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. 
6  పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో మిక్కిలి ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. 
  7-8. కాబట్టి మకెదొనియలోను అకైయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; మీయొద్దనుండి ప్రభువు వాక్యము మకెదొనియలోను అకైయలోను మ్రోగెను; అక్కడమాత్రమేగాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను. గనుక మేమియు చెప్పవలసిన అవశ్యకములేదు. 
  9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకమునుండి వచ్చునని తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. 

No comments:

Post a Comment