Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

1వథెస్సలొనీకయులకు3వఅధ్యాయము

 1-4. కాబట్టి ఇకను సహింపజాలక అతేనైలో మేమెంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, యీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమొథెయును పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు. 
5  ఇందుచేత నేనును ఇకను సహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని. 
6  తిమొథెయు ఇప్పుడు మీయొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడనపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకముచేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమనుగూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. 
7  అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణపొందితిమి. 
8  ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టేయున్నది. 
9-10. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని దివారాత్రము అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? 
11  మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చునుగాక. 
12-13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవునియెదుట మీ హృదయములను పరిశుద్ధతవిషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో ఆలాగే మీరును ఒకనియెడల ఒకడును మనుష్యులందరియెడలను ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 

No comments:

Post a Comment