1 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.
2 కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధినొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.
3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
4-5. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండటయే (దేవుని చిత్తము)
6 ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసముచేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు.
7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
8 కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
9 సహోదర ప్రేమనుగూర్చి నేను మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి.
10-12. ఆలాగుననే మకెదొనియయందతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయుందు మరి ఎక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు, (సంఘమునకు) వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక మీ స్వంతకార్యములను జరుపుటకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
13 సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారినిగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
14 యేసు మృతిపొంది తిరిగిలేచెనని మనము నమ్మినయెడల అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును.
15 మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు ఆగమనపర్యంతము సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా (ఆయన సన్నిధి ) చేరము.
16 ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు.
17 ఆమీదట సజీవులమై నిలిచియుండు మనము వారతోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీదకొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము.
18 కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

No comments:
Post a Comment