Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

1వథెస్సలొనీకయులకు1వఅధ్యాయము

1  తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న థెస్సలొనీకైయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమొథెయును (శుభమని చెప్పి) వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 
2  విశ్వాసపూర్వకమైన మీ పనిని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ పూర్వకమైన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవునియెదుట మానక జ్ఞాపకముచేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 
3  విశ్వాసపూర్వకమైన మీ పనిని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ పూర్వకమైన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవునియెదుట మానక జ్ఞాపకముచేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 
4  ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. 
5  ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. 
6  పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో మిక్కిలి ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. 
  7-8. కాబట్టి మకెదొనియలోను అకైయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; మీయొద్దనుండి ప్రభువు వాక్యము మకెదొనియలోను అకైయలోను మ్రోగెను; అక్కడమాత్రమేగాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను. గనుక మేమియు చెప్పవలసిన అవశ్యకములేదు. 
  9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకమునుండి వచ్చునని తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. 

1వథెస్సలొనీకయులకు2వఅధ్యాయము

1  సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థముకాలేదు గాని. 
2  మీరెరిగినట్టే మేము ఫిలిప్పయిలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును. 
3  ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని 
4  సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. 
5  మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షనుకప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి. 
6  మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమైయున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరులవలననే గాని మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. 
7  అయితే స్తన్యమిచ్చు తల్లి తన స్వంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి. 
8  మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్షగలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. 
9  అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. 
10  మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 
11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. 
13  ఆ హేతువుచేతను మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. 
14  అవును సహోదరులారా, మీరు యూదైయలో క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనినవారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ స్వదేశస్థులవలన అనుభవించితిరి. 
15-16. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తిచేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులుకానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను. 
17  సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీ దగ్గెర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖముచూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నముచేసితిమి. 
18  కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి; పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. 
19  ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు ఆగమన సమయమున ఆయన యెదుట మీరే గదా. 
20  నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు. 
         Download Audio File

1వథెస్సలొనీకయులకు3వఅధ్యాయము

 1-4. కాబట్టి ఇకను సహింపజాలక అతేనైలో మేమెంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, యీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమొథెయును పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు. 
5  ఇందుచేత నేనును ఇకను సహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని. 
6  తిమొథెయు ఇప్పుడు మీయొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడనపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకముచేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమనుగూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. 
7  అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణపొందితిమి. 
8  ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టేయున్నది. 
9-10. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని దివారాత్రము అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? 
11  మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చునుగాక. 
12-13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవునియెదుట మీ హృదయములను పరిశుద్ధతవిషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో ఆలాగే మీరును ఒకనియెడల ఒకడును మనుష్యులందరియెడలను ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 

1వథెస్సలొనీకయులకు4వఅధ్యాయము

1  మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. 
2  కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధినొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. 
3  మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 
  4-5. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండటయే (దేవుని చిత్తము) 
6  ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసముచేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు. 
7  పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 
8  కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. 
9  సహోదర ప్రేమనుగూర్చి నేను మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి. 
10-12. ఆలాగుననే మకెదొనియయందతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయుందు మరి ఎక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు, (సంఘమునకు) వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక మీ స్వంతకార్యములను జరుపుటకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము. 
13  సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారినిగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. 
14  యేసు మృతిపొంది తిరిగిలేచెనని మనము నమ్మినయెడల అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును. 
15  మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు ఆగమనపర్యంతము సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా (ఆయన సన్నిధి ) చేరము. 
16  ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. 
17  ఆమీదట సజీవులమై నిలిచియుండు మనము వారతోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీదకొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము. 
18  కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. 

1వథెస్సలొనీకయులకు5వఅధ్యాయము

1  సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయునక్కరలేదు. 
2  రాత్రివేళ దొంగ ఏలాగువచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగ తెలియును. 
3  లోకులు - నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించునుగనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు. 
4  సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. 
5  మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు;2మనము రాత్రివారము కాము, చీకటివారముకాము. 
6  కావున ఇతరులవలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులముకాక యుందుము. 
7  నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. 
8  మనము పగటివారమైయున్నాము గనుక మత్తులమైయుండక, విశ్వాసప్రేమలను మైమరుపును, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. 
9  ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు. 
10  మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను. 
11  కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనికొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. 
12  మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై యుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి 
13  వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. 
14  సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా - అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత ఇయ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. 
15  ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; 
  16-18. యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవునిచిత్తము. 
19  ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 
20  సమస్తమును పరీక్షించి మేలైనదాని చేపట్టుడి. 
  21-22. ప్రతి విధమైన కీడుకుదూరముగా ఉండుడి. 
23  సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. 
24  మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును. 
25  సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి. 
26  పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. 
27  సహోదరులందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. 
28  మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.